తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఎన్నికలకు ములుగు జిల్లా సిద్ధం: కలెక్టర్ - mulugu

ఈనెల 11న జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని ములుగు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. పలు శాఖల అధికారులకు శిక్షణ ఇచ్చామని, రేపు ఈవీఎంలతో ప్రతి బూత్​కు వెళ్తారని తెలిపారు.

ములుగు జిల్లా కలెక్టర్

By

Published : Apr 9, 2019, 8:00 PM IST

ఏప్రిల్​ 11న జరిగే పార్లమెంట్​ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ములుగు జిల్లా కలెక్టర్​ సి.నారాయణరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో రెండు లక్షల 14వేల మంది ఓటర్లు ఉన్నారని, 302 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్​ సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. వికలాంగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వీల్​ఛైర్లు, ప్రత్యేక వాలంటీర్లను నియమించామని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ములుగు జిల్లా కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details