తెలంగాణ

telangana

ETV Bharat / briefs

చరిత్ర సృష్టించిన రెఫరెండం ఎంపీటీసీ - referendem

ఎన్నికల్లో నాయకులెన్నో హామీలిస్తారు..ఒక్కసారి గెలిచిన తర్వాత ఆ మాటే మర్చిపోతారు. ఐదేళ్ల వరకు నాకేం సంబంధం లేదన్నట్టు కాలర్ ఎగరేసుకుని తిరుగుతారు. కానీ..గెలిచిన తర్వాత తమ పనితీరుపై ప్రజాభిప్రాయం తీసుకునే నేతలు ఎంతమంది..?. నల్గొండ జిల్లాలోని ఆ ఊళ్లో ఓ నేత ఎంపీటీసీగా గెలిచి మళ్లీ రెఫరెండం పెట్టుకుని రాజకీయ చరిత్రలో నిలిచిపోయారు?

చరిత్ర సృష్టించిన ఓ ఎంపీటీసీ

By

Published : May 8, 2019, 3:51 PM IST

Updated : May 8, 2019, 4:56 PM IST

ఇది నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని నేరడ గ్రామం. ఇక్కడి ప్రజల్లో రాజకీయ చైతన్యమూ ఎక్కువే. 2001లో నేరడ గ్రామ ఎంపీటీసీగా దుబ్బాక నర్సింహారెడ్డి ఎన్నికయ్యారు. తన పదవీ కాలంలో గ్రామాభివృద్ధి కోసం కృషి చేశారు. ప్రజాసేవపై గ్రామస్తులు ఏమనుకుంటున్నారో అనే ప్రశ్న ఆయనలో మెదిలింది. 2003లో తన పనితీరుపై ప్రజాతీర్పు తెలుసుకోవాలనుకున్నారు. స్వచ్ఛంద సంస్థతో సహకారంతో రాజకీయ చరిత్రలోనే తొలిసారి ఎంపీటీసీగా రెఫరెండం పెట్టుకున్నారు. ఎలాంటి ప్రలోభాల తావులేకుండా 1600 ఓట్లు పోలయ్యాయి. అందులో 1510 ఓట్లు దుబ్బాక పనితీరుకు అనుకూలంగా వచ్చాయి.

చరిత్ర సృష్టించిన ఓ ఎంపీటీసీ


ఆరోజుల్లో ఐదారు వేల ఖర్చుతో ఎన్నికలు అయిపోయేవి..కానీ ఈరోజుల్లో ఎంపీటీసీ ఎన్నికల కోసం 30లక్షలు ఖర్చు చేస్తున్నారు. రాజకీయాల్లో ఈ తీరు మారాలి..
- దుబ్బాక నర్సింహా రెడ్డి


దుబ్బాక రెఫరెండంపై గ్రామస్థుల హర్షం..

ఎంపీటీసీగా దుబ్బాక నర్సింహారెడ్డి చేసిన అభివృద్ధికి నిదర్శంగా రెఫరెండం పెట్టుకున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. భారతదేశంలోనే తన పాలన తీరుపై ప్రజాభిప్రాయం కోరిన తొలి ఎంపీటీసీ అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గెలిచిన తర్వాత ఎంత సంపాదించామని లెక్కలు వేసుకునే ఈ రోజుల్లో ఇలాంటి నాయకులు అరుదు. అందుకే రెఫరెండం పెట్టుకుని ఇప్పటికి దుబ్బాక నర్సింహారెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇవీ చూడండి: 'టికెట్ల ధర పెంచాలని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు'

Last Updated : May 8, 2019, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details