నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి కురుస్తున్న తెలికపాటి చినుకులతో వాతావరణం చల్లబడింది. తీవ్ర ఉక్కపోతతో బాధపడుతున్న ప్రజలు తొలకరి జల్లులను ఆస్వాదిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో పిడుగుపాటుతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. 3 ఆవులు, 2 గేదెలు మృతిచెందాయి.
నగరంలో భారీ వర్షం
హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, నారాయణగూడ, బేగంబజార్, హిమాయత్‌నగర్, గచ్చిబౌలి, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, మలక్‌పేట, మూసారాంబాగ్, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌లో మోస్తరు వర్షం కురిసింది. కూకట్‌పల్లి, మల్లాపూర్, చేవెళ్ల, షాబాద్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వర్షంతో రోడ్లన్నీ జలమయమ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపై నిలిచిన నీటిని జీహెచ్ఎంసీ, విపత్తు సహాయక బృందాలు నీటిని బయటకు పంపి ట్రాఫిక్‌ను క్లియర్ చేశాయి.
సికింద్రాబాద్‌లో రోడ్లపై నీరు