స్వామి వివేకానంద సిద్ధాంతాలకనుగుణంగా నడిస్తే భారత్ నెంబర్ వన్‌గా ఉండేదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. 55 ఏళ్ల వారసత్వ రాజకీయాల్లో కాంగ్రెస్ చేసిందేమీ లేదని కోల్‌కతా వేదికగా జరిగిన బహిరంగ సభ వేదికగా పేర్కొన్నారు. ఇప్పుడు వైమానిక దాడులు, ఉపగ్రహంపై దాడులతో భారత్ నెంబర్ వన్ స్థానం వైపు దూసుకెళ్తుందన్నారు.
పాకిస్థాన్‌కు గాయమైతే ప్రతిపక్షాలకెందుకు నొప్పి అని ప్రశ్నించారు మోదీ. వైమానిక దాడులపై ప్రతిపక్షాలు రుజువులు కోరి సైన్యం ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. ఉగ్రవాదంపై కాంగ్రెస్ ఎప్పుడూ తలవంచే విధానాన్ని అవలంబిస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ప్రజాస్వామ్యం కాదు... వారసత్వస్వామ్యం: మోదీ
"దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది... కానీ దేశ ప్రజలకు రాలేదు.. ప్రజాస్వామ్యం ముసుగుతో వారసత్వస్వామ్యం రాజ్యమేలింది. దేశంలో 55 ఏళ్లు వారసత్వస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యం అతికష్టం మీద 15, 16 ఏళ్లు కొనసాగింది. 72 ఏళ్లుగా ప్రతిభ, సృజనాత్మకత, కష్టించే తత్వంతో ఉన్నప్పటికీ దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన ఎందుకు చేరలేదు. ఇది అతిపెద్ద సవాల్. ప్రతిభావంతుల విషయంలో మనకు లోటులేదు... దేశభక్తులకు లోటు లేదు..కష్టించే తత్వం ఉన్నవారి లోటు లేదు... ప్రకృతి సంపద ఉంది. 55 ఏళ్ల పాలనలో యువ ప్రతిభావంతుల్లో ఉన్న బలాన్ని వారసత్వస్వామ్యం తీసివేసింది." -నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి:వీరికి ఓటు వేసే అవకాశం కల్పించలేమా?