రాజ్యాంగ నిబంధనలకు లోబడి రాజీనామా చేశానని శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. మంత్రిగా 6 నెలల పదవీ కాలంలో 3 నెలలు ఎన్నికల కోడ్‌కే పోయింద్న శ్రావణ్... గిరిజనుడిగా తనకు మంత్రి పదవి దక్కటం సంతోషం ఉందన్నారు. సీఎం చంద్రబాబు తనను కుటుంబ సభ్యుడిగా చూసుకున్నారని కిడారి శ్రావణ్ పేర్కొన్నారు. తన శాఖ ద్వారా గిరిజనులకు ఫుడ్ బాస్కెట్ పథకం తేవటం సంతోషదాయకమని చెప్పారు.
మంత్రి పదవికి కిడారి శ్రవణ్ కుమార్ రాజీనామా - lokesh
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి పదవికి కిడారి శ్రావణ్ కుమార్ రాజీనామా చేశారు. రాజీనామాకు ముందు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌తో సమావేశమయ్యారు. వీరి భేటీలో రాజీనామా అంశంపై చర్చించారు.
శ్రావణ్ తండ్రి కిడారి సర్వేశ్వరరావు అరకు ఎమ్మెల్యేగా ఉండగా... మావోయిస్టులు హతమార్చారు. తదనంతరం శ్రావణ్‌ను గతేఏడాది నవంబర్ 11న చంద్రబాబు మంత్రివర్గంలో తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండ మంత్రి అయిన ఆరు నెలల్లో... ఏదో ఒక చట్టసభకు ఎన్నిక కావాలి. కానీ ఇప్పటివరకు ఎన్నిక కాలేదు. మంత్రిగా శ్రావణ్‌కుమార్ 6 నెలల పదవికాలం ఈనెల 10వ తేదీతో ముగియనుంది. గవర్నర్ కార్యాలయం ఇదే అంశాన్ని గుర్తు చేస్తూ ప్రభుత్వానికి సమాచారం పంపింది.
ఇదీ చదవండి...మోదీ... ఓ విఫల ప్రధానమంత్రి : చంద్రబాబు