స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. రంగారెడ్డి, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల నియోజకవర్గాల్లో తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడు జిల్లాల పరిధిలో 25 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ప్రధాన పోటీ తెరాస, కాంగ్రెస్ మధ్యే...
రంగారెడ్డి జిల్లాలో తెరాస అభ్యర్థి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నల్గొండలో తెరాస నుంచి తేరా చిన్నపరెడ్డి, హస్తం నేత కోమటిరెడ్డి లక్ష్మి బరిలో నిలిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెరాస నేత పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డితో పాటు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.