హైదరాబాద్ హైదర్‌గూడలో నూతనంగా నిర్మించిన శాసనసభ్యుల నివాస సముదాయం ప్రారంభానికి సిద్ధమయింది. ఈ నివాససముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రారంభించనున్న దృష్ట్యా.... అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సకల సౌకర్యాలతో... అత్యాధునిక సొభగులతో... ఒక్కో ఎమ్మెల్యేకు మూడు పడక గదుల ఫ్లాట్‌ను కేటాయించారు. సువిశాలమైన పార్కింగ్, ఆకుపచ్చనైన పార్క్‌తో పాటు జిమ్... సూపర్‌మార్కెట్, గ్రంథాలయం లాంటి సదుపాయాలున్న కొత్త సముదాయంపై ఈటీవీ భారత్ అందిస్తున్న దృశ్య సమర్పణ...
కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సకల సౌకర్యాలు
శాసనసభ్యుల కోసం నాలుగెకరాల 26 గుంటల స్థలంలో సూమారు రూ.166 కోట్లతో అన్ని సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా... నిర్మించిన సముదాయం ప్రారంభానికి సిద్ధమైంది. ఎమ్మెల్యేలకు కార్యాలయాల నుంచి సూపర్‌మార్కెట్ వరకు అన్ని రకాల సదుపాయలతో రూపుదిద్దుకున్న నిర్మాణాలను మీరూ చూడండి.
mla-quarters-presentation