రాష్ట్ర మంత్రులు వారి వారి నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ పార్టీకి చెందిన అభ్యర్థుల గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధమని అందరూ విధిగా ఓటు వేయాలని సూచించారు.
మంత్రి ఈటల
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు.
సికింద్రాబాద్‌లో తలసాని
సికింద్రాబాద్ మారెడ్‌పల్లిలోని కస్తూర్బా గాంధీ కళాశాలలో మంత్రి తలసాని ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని అన్నారు.
45 ఏళ్లుగా ఓటేస్తున్నా: మంత్రి ఎర్రబెల్లి
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన స్వగ్రామం వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని 255 పోలింగ్ కేంద్రం లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన సతీమణి ఉషతో కలిసి వచ్చి ఓటేశారు. గత 45 ఏళ్లుగా ఓటేస్తున్నానన్నారు.
ఇలా అయితే ఎలా..?: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ఎన్నికల సంఘం విఫలమైందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ముదిరాజ్ భవన్లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు.
మే 23న దేశ భవిష్యత్తు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దేవాదాయ, అటవీ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ మండలం ఎల్లపల్లిలో ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మే 23న దేశ రాజకీయ భవిష్యత్తు తెలుస్తుందన్నారు.
సూర్యాపేటలో ఓటేసిన జగదీశ్