ప్రమాణస్వీకారం చేసిన జగన్ సేన - ministers oath
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం చేపట్టిన ప్రమాణస్వీకార కార్యక్రమం వైభవంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మొత్తం 25 మంది మంత్రులతో వెలగపూడిలోని సచివాలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం కొలువుదీరింది. మొత్తం 25 మంది మంత్రులతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. వెలగపూడిలోని సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మంత్రులుగా వరుస క్రమంలో మొదట శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ప్రమాణం చేశారు. ఆతర్వాత మిగిలిన మంత్రులు ప్రమాణం చేసి జగన్, గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్, నెల్లూరు జిల్లాకు చెందిన గౌతంరెడ్డి ఆంగ్లంలో ప్రమాణం చేశారు.