కాంగ్రెస్, భాజపా నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి దేశమంతా చర్చించుకుంటున్నా.. ప్రతిపక్షాల వాదన మారలేదన్నారు. ప్రాణహిత చేవెళ్లలో తట్టెడు మట్టి కూడా కాంగ్రెస్ హయాంలో తీయలేదని ఆరోపించారు. భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా ఎన్నుకోవడం ఆ పార్టీ నేతలకే ఇష్టంలేదన్నారు. ఫెడరల్ ప్రంట్ కోసం కేంద్ర ప్రభుత్వం దిగిపోవాలని తామెప్పుడూ కోరుకోలేదని తలసాని స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు హైదరాబాద్ అడ్డాగా మారిందన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు.
'ప్రాణహిత చేవెళ్లలో తట్టెడు మట్టి తీయలేదు'
కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. కాళేశ్వరం విషయంలో వారి వాదన సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం పడిపోవాలని తామెప్పుడూ కోరుకోలేదని తలసాని స్పష్టం చేశారు.
'ప్రాణహిత చేవేళ్లలో తట్టెడు మట్టి తీయలేదు'