ఈ నెల 6న హైదరాబాద్లో ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన మధులిక ఆరోగ్యం కుదుటపడింది. మలక్పేట యశోద ఆస్పత్రిలో రెండు వారాలుగా చికిత్స పొందిన బాధితురాలిని ఈరోజు డిశ్చార్జ్ చేశారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు ఆమె తల్లిదండ్రులకు సూచించారు. ఇంకా కొన్నాళ్లపాటు వైద్యుల పర్యవేక్షణ అవసరమని తెలిపారు.
అందరి సహకారం వల్లే తాను మళ్లీ బతకగలిగానని మధులిక తెలిపింది.
మధులిక ఆరోగ్యం మెరుగుపడడానికి కృషిచేసిన వైద్యులకు బాధితురాలు తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆదుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.
ఆసుపత్రి వద్ద మధులిక బంధుమిత్రులు, మీడియా రాకతో హడావుడి నెలకొంది.
మధులిక డిశ్చార్జ్ - హైదరాబాద్
ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి.. మలక్పేట యశోద ఆస్పత్రిలో రెండు వారాల పాటు చికిత్స పొందిన మధులిక ఈ ఉదయం డిశ్చార్జ్ అయ్యారు.
ఇంటికి చేరుకున్న మధులిక
ఇవీ చదవండి:మధులిక కోలుకుంది