స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పోరుకు సర్వం సిద్ధమైంది. వరంగల్, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు ఉదయం ఎనిమిది గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఓరుగల్లులో తెరాస అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డితో పాటు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నల్గొండలో తెరాస అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మి బరిలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో తెరాస అభ్యర్థిగా మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
గుర్తులుండవు..!
ఈ ఎన్నికల్లో గుర్తులుండవు. అభ్యర్థుల ఫొటోలు ఉంటాయి. అంకెల ప్రాతిపాదికన ఓట్లు వేయాల్సి ఉంటుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మొత్తం 2,799 మంది ఓటర్లు ఉన్నారు. మూడు జిల్లాల్లో తెరాస ఆధిక్యం ఉన్నా... కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.