లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటం వల్ల కరీంనగర్లో ఎల్ఈడీ స్క్రీన్లతో కూడిన ప్రచార రథాలను ఎంపీ వినోద్‌కుమార్ ప్రారంభించారు. ఈ వాహనాల ద్వారా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజలు తెరాస పార్టీకి మద్దతు ఇస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు.
నాలుగు రోజులే సమయం.. ఎల్ఈడీ ప్రచార రథాలు సిద్ధం - election
తెరాస ఎల్ఈడీ ప్రచార రథాలను కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ ప్రారంభించారు. వీటిని ఉపయోగించి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు
ఎల్ఈడీ ప్రచార రథాలు సిద్ధం