తెలంగాణ

telangana

ETV Bharat / briefs

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

కోల్​కతాలో జరుగుతున్న ఐపీఎల్​ మ్యాచ్​లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది.  కరీబియన్ వీరులు గేల్, రసెల్.. ఈరోజు ఎలాంటి విధ్వంసక బ్యాటింగ్ ఆడతారా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్ని పంజాబ్ జట్టు

By

Published : Mar 27, 2019, 7:47 PM IST

ఈడెన్ గార్డెన్స్​ వేదికగా పంజాబ్-కోల్​కతా మ్యాచ్​లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్లు తమ తొలి మ్యాచ్​ల్లో గెలుపొందాయి. ఇప్పుడు రెండు విజయంపై కన్నేశాయి.

2017 నుంచి ఈడెన్ గార్డెన్స్​లో జరిగిన అన్ని ఐపీఎల్​ మ్యాచ్​ల్లోనూ టాస్ గెలిచిన జట్టు బౌలింగ్​నే ఎంచుకోవడం విశేషం.

కింగ్స్ జట్టులో క్రిస్ గేల్ మరో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. గత మ్యాచ్​లో యువ క్రికెటర్ సర్ఫరాజ్ 47 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

కోల్​కతా జట్టులో రసెల్ చేలరేగి ఆడి మొదటి మ్యాచ్​లో విజయాన్ని తెచ్చిపెట్టాడు. ఈ మ్యాచ్​లోనూ అదే తరహాలో చెలరేగాలని జట్టు మేనేజ్​మెంట్ కోరుకుంటోంది. యువ బ్యాట్స్​మెన్ నితీశ్ రానా అర్ధ శతకంతో రాణించాడు.

దిల్లీతో జరిగిన తన తొలి మ్యాచ్​లో 'మన్కడింగ్' చేసిన పంజాబ్ జట్టు కెప్టెన్ అశ్విన్ విమర్శలు ఎదుర్కొన్నాడు.

జట్లు:

కోల్​కతా నైట్​ రైడర్స్​
దినేశ్ కార్తీక్(కెప్టెన్), రాబిన్ ఉతప్ప, క్రిస్​ లిన్​, శుభ్​మన్ గిల్​, ఆండ్రి రసెల్, సునీల్ నరైన్​, పియూష్ చావ్లా, కుల్​దీప్ యాదవ్​, నితీశ్ రానా, ప్రసిధ్ కృష్ణ, ల్యూకీ ఫెర్గుసన్​

కింగ్స్ ఎలెవన్ పంజాబ్​:
రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), సామ్ కరన్​, మహమ్మద్ షమి, సర్ఫరాజ్ ఖాన్​, క్రిస్​గేల్, కే ఎల్ రాహుల్, అంకిత్ రాజ్​పుత్​, మయాంక్​ అగర్వాల్​, కరుణ్​ నాయర్​, ముజీబుర్ రెహమాన్, డేవిడ్ మిల్లర్​

ABOUT THE AUTHOR

...view details