కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం సారసాల గ్రామంలో అటవీ అధికారులపై జరిగిన దాడి విషయమై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్పందించారు. రైతులపై అటవీ అధికారులు జులుం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతుల భూములను అటవీ అధికారులు అన్యాయంగా స్వాధీన పర్చుకోవాలని చూశారని ఆరోపించారు. పట్టా భూముల్లో రైతులు దున్నుకుంటుంటే అటవీ అధికారులు ప్రతిపక్ష నాయకులకు చెందిన ట్రాక్టర్లు పెట్టి దున్నడానికి వచ్చారని తెలిపారు. తన సోదరుడు కోనేరు కృష్ణ రైతుల పక్షాన అక్కడికి వెళ్లి అడ్డుకున్నాడని వివరించారు. గాయపడిన అధికారిణిపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని కోరుతూనే... దీనిపై పూర్తి విచారణ జరిపించాలని అటవీ శాఖ మంత్రిని ఎమ్మెల్యే కోనప్ప డిమాండ్ చేశారు.
నా తమ్ముడు దాడి చేయలేదు: ఎమ్మెల్యే కోనప్ప
అటవీ అధికారులపై జరిగిన దాడి ఘటన మీద స్పందించారు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. పట్టా భూముల్లో అధికారులు వచ్చి దున్నితే వద్దని బతిమాలినా వినకుండా దాడి చేశారని ఆరోపించారు. అలాంటి సమయంలోనే తన తమ్ముడు రైతుల తరఫున మాట్లాడేందుకు వెళ్లాడని... అధికారులపై దాడి చేయలేదని కోనప్ప వివరించారు.
KONERU KONAPPA REACTED ON FARMERS ATTACK ON FOREST OFFICERS