న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత్ ఓడింది. 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. కానీ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న కేఎల్ రాహుల్‌పై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. అతడు ప్రస్తుతం కత్తి కంటే పదునుగా ఉన్నాడని రాసుకొచ్చాడు.
'కేఎల్ రాహుల్.. కత్తి కంటే పదునైన క్రికెటర్'
ప్రస్తుత టీమిండియా తరఫున అద్భుతంగా రాణిస్తున్న కేఎల్ రాహుల్.. కత్తి కంటే పదునుగా ఉన్నాడని అన్నాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. ట్విట్టర్ వేదికగా అతడిపై ప్రశంసలు కురిపించాడు.
'ప్రస్తుతం కేఎల్ రాహుల్ కత్తి కంటే పదునుగా ఉన్నాడు. ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా, వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఐదో స్థానంలోనూ వచ్చి ఉత్తమ ఫినిషర్‌గా నిరూపించుకున్నాడు. ఇలా ఏ స్థానంలో ఆడినా సరే రెచ్చిపోతున్నాడు. రాహుల్ నీ ఆటతీరును కొనసాగించాలని కోరుకుంటున్నా' -ట్విట్టర్లో మహ్మద్ కైఫ్
కివీస్‌తో జరిగిన తొలివన్డేలోనూ ఐదో స్థానంలో వచ్చి, కేవలం 64 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. ఇందులో 6 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. ఈ వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ గైర్హాజరుతో పృథ్వీషా, మయాంక్ అగర్వాల్‌లు ఓపెనింగ్‌కు దిగారు. ఈ కారణంతోనే రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇలా ఏ స్థానంలో వచ్చినా సరే తన విధ్వంసకర ఆటతీరుతో రాహుల్ జట్టులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు.