తెలంగాణ

telangana

ETV Bharat / briefs

వల్లబ్​భాయ్​ పటేల్​కు నివాళులర్పించిన కిషన్​రెడ్డి - నివాళులర్పించిన కిషన్​రెడ్డి

హైదరాబాద్​లో అసెంబ్లీ ముందున్న సర్దార్​ వల్లబ్​భాయ్ పటేల్​ విగ్రహానికి కేంద్రమంత్రి కిషన్​రెడ్డి నివాళులర్పించారు. భాజపా ఆలోచన విధానం, ప్రభుత్వ పనితనం పటేల్​ అడుగుజాడల్లో నడుస్తోందని ఆయన తెలిపారు.

నివాళులర్పించిన కిషన్​రెడ్డి

By

Published : Jun 8, 2019, 4:32 PM IST

భాజపా ఆలోచన విధానం, ప్రభుత్వ పనితనం సర్దార్​ వల్లబ్​భాయ్ పటేల్​ అడుగుజాడల్లో నడుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్​రెడ్డి అన్నారు. హైదరాబాద్​లోని అసెంబ్లీ ముందున్న పటేల్​ విగ్రహానికి కిషన్​రెడ్డితో పాటు ఎంపీ బండి సంజయ్​ పూలమాల వేసి నివాళులర్పించారు. దేశాన్ని ఏకం చేసిన మహనీయుని నుంచి స్ఫూర్తి పొందాలనే నివాళి అర్పించినట్లు చెప్పారు. దేశానికి 1947లో స్వాతంత్ర్యం వస్తే నిజాం మాత్రం రజాకార్ల​ రాజ్యంతో దుర్మార్గాన్ని సృష్టించారని విమర్శించారు. నాటి హోంమంత్రి పటేల్​ సైనిక చర్య వల్లనే భాగ్యనగరానికి విముక్తి లభించిందని కిషన్​రెడ్డి గుర్తు చేశారు.

నివాళులర్పించిన కిషన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details