తెలంగాణ

telangana

ETV Bharat / briefs

"కిరణ్​ బేడీని వెనక్కు పిలవాల్సిందే" - కిరణ్​ బేడీ

పుదుచ్చేరి లెఫ్టినెంట్​ గవర్నర్​ కిరణ్​ బేడీకి వ్యతిరేకంగా రాజ్​నివాస్​ ముందు ముుఖ్యమంత్రి నారాయణ స్వామి చేపట్టిన ధర్నా రెండో రోజూ కొనసాగుతోంది.

నారాయణ స్వామి

By

Published : Feb 14, 2019, 2:42 PM IST

లెఫ్టినెంట్ గవర్నర్​ కిరణ్​ బేడీకి వ్యతిరేకంగా పుదుచ్చేరి రాజధాని పాండిచ్చేరిలోని రాజ్​నివాస్​ ముందు ముఖ్యమంత్రి నారాయణ స్వామి చేపట్టిన ధర్నా రెండో రోజుకు చేరుకుంది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను కిరణ్​బేడీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు సీఎం. కేంద్ర ప్రభుత్వం కిరణ్​ బేడీని వెనక్కి పిలవాలని డిమాండ్​ చేశారు. సీఎం నారయణ స్వామి, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి ధర్నాలో పాల్గొన్నారు.

" మంత్రివర్గ నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడానికి కిరణ్​ బేడీకి ఎటువంటి అధికారాలు లేవు. ఆమె ప్రభుత్వ నిర్ణయాలను రద్దు చేస్తోంది. ప్రభుత్వ పాలనలో సమస్యలు సృష్టించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆమెను ప్రోత్సహిస్తున్నారు. మాకు కేవలం తమిళనాడు నుంచే మద్దతు లభించటంలేదు దేశం మొత్తం మద్దతు పలుకుతోంది. లెఫ్టినెంట్​ గవర్నర్​ కిరణ్​ బేడీతో మాకు 39 విషయాలపై సమస్యలున్నాయి. " -నారాయణ స్వామి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి

పలువురి మద్దతు

పుదుచ్చేరి ముఖ్యమంత్రి చేస్తోన్న ధర్నాకు కాంగ్రెస్​ పార్టీతో పాటు డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్​ మద్దతు ప్రకటించారు. పుదుచ్చేరి స్పీకర్​ మైతిలింగమ్​ సీఎంకు మద్దతు పలుకుతూ ధర్నాలో పాల్గొన్నారు.

రాజ్​నివాస్​ వద్ద భారీ భద్రత

ముఖ్యమంత్రి ధర్నా నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు చెలరేగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాజ్​నివాస్​, పరిసర ప్రాంతాల్లోకి అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

కట్టుదిట్టమైన భద్రత మధ్య కిరణ్​ బేడి గురువారం ఉదయం దిల్లీకి వెళ్లారు. ఫిబ్రవరి 20న తిరిగి వచ్చిన అనంతరం ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రిని చర్చలకు ఆహ్వానించనునట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details