తెలంగాణ

telangana

ETV Bharat / briefs

దేశం దశ.. దిశ మారుద్దాం: కేసీఆర్ - mulugu

రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. సారు...కారు.. పదహారు నినాదంతో కేసీఆర్​ ముందుకెళ్తున్నారు. మహబూబాబాద్​, ఖమ్మం నియోజకవర్గాల్లోని సభలకు గులాబీ బాస్​ హాజరయ్యారు. బయ్యారం ఉక్కు పరిశ్రమను కచ్చితంగా సాధించుకుంటామని హామీనిచ్చారు.

గులాబీమయమైన ఖమ్మం, మహబూబాబాద్​ సభలు

By

Published : Apr 5, 2019, 8:50 AM IST

Updated : Apr 5, 2019, 11:14 AM IST

గులాబీమయమైన ఖమ్మం, మహబూబాబాద్​ సభలు
కాంగ్రెసేతర, భాజాపేతర కూటమి ప్రభుత్వం వస్తేనే దేశం బాగుపడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్‌, ఖమ్మం నియోజకవర్గాల్లో సభలకు హాజరైన ముఖ్యమంత్రి... 66ఏళ్లు పాలించిన రెండు పార్టీలే పరస్పరం విమర్శించుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. పదహారు ఎంపీ సీట్లు గెలుచుకుని కేంద్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిద్దామని ఓటర్లకు సూచించారు.

ఎవరు అడగకుండానే ప్రజల అవసరాలు గుర్తించి పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాబాద్‌లో స్పష్టం చేశారు. భూముల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు చేస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పంట రుణాలను మూడు, నాలుగు దఫాలుగా మాఫీ చేస్తామని పేర్కొన్నారు. గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపడానికే ఈప్రాంతాన్ని నాలుగు జిల్లాలుగా చేశామని స్పష్టం చేశారు

మహబూబాబాద్‌లో సభ ముగించుకుని... ఖమ్మం సభకు చేరుకున్న కేసీఆర్ బయ్యారం ఉక్కు పరిశ్రమను కచ్చితంగా సాధించుకుంటామని తెలిపారు. దేశంలో ఉన్న వనరులను వినియోగించుకోవడంలో కాంగ్రెస్‌, భాజపా ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. దేశ భవిష్యత్‌ను నిర్ణయించడంలో లోక్‌సభ ఎన్నికలు కీలకమైనవని విబేధాలు లేకుండా తెరాస నేతలందరూ ఒక్కటై 16మంది ఎంపీలను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు గులాబీ బాస్​.

ఎన్నికల తర్వాత నర్సరీ రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తామని ప్రకటించారు. సుబాబుల్‌ రైతుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని తెలిపారు​.

ఇవీ చూడండి:రసాభాసగా కురుమ సంఘం నాయకుడి సన్మాన సభ​​​​​​​

Last Updated : Apr 5, 2019, 11:14 AM IST

ABOUT THE AUTHOR

...view details