పార్లమెంట్ ఎన్నికల్లో తెరాస 16 స్థానాల్లో గెలుస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఫలితాల అనంతరం గులాబీ శ్రేణులు సంబురాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో విజయంపై జిల్లాల్లోని మంత్రులు, పార్టీ అభ్యర్థులు, శాసనసభ్యులు, మండలి సభ్యులతో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే.. లోక్సభ ఫలితాలు కూడా ఏకపక్షంగా ఉంటాయన్నారు. విపక్షాలు మళ్లీ ఓటమి పాలు కావడం ఖాయమని జోస్యం చెప్పారు.
పదహారు స్థానాల్లో కారే గెలుస్తది.. సంబురాలు జేస్కోవాలే! - తెరాస
పదహారు స్థానాల్లో కారు గెలుస్తది.. సంబురాలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే.. ఫలితం ఏకపక్షంగా ఉండబోతోందని జోస్యం చెప్పారు.
సంబురాలు జేస్కోవాలే!
తెరాస శ్రేణులు లెక్కింపు కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడయినా.. సమస్య తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. తెలంగాణ భవన్ వద్ద ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని.. ఏవైనా సందేహాలుంటే సంప్రదించాలని సూచించారు. ఈవీఎం, వీవీప్యాట్ల విధానానికి తెరాస పూర్తిగా మద్దతిచ్చిందని.. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని సీఎం అన్నారు.
ఇవీ చూడండి: ఖమ్మం పోరులో విజేత ఎవరు?