తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రాజకీయాల్లో దారి చూపేది టార్చ్​లైట్​: కమల్​ - ఎమ్​ఐఎమ్​

కమల్​ హాసన్ 'మక్కల్​ నీది మయ్యం' పార్టీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగుతోంది. తమిళనాడు, పుదుచ్ఛేరిలోని 40 లోక్​సభ స్థానాల్లో పోటీకి రంగం సిద్ధం చేస్తున్నారు కమల్​. తాజాగా ఆయన పార్టీకి 'టార్చ్​లైట్'​ ను గుర్తుగా కేటాయించింది ఎన్నికల సంఘం.

రాజకీయాల్లో దారి చూపేది టార్చ్​లైట్​: కమల్​

By

Published : Mar 10, 2019, 11:17 PM IST

'మక్కల్​ నీది మయ్యం' పార్టీకిఈసీ'టార్చ్​లైట్'​ గుర్తు కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు నటహాసన్​.

టార్చ్​లైట్​ పట్టుకొని దిగిన ఫొటోనుసామాజిక మాధ్యమాల్లో పంచుకొన్నారు.

'ఎమ్​ఎన్​ఎమ్​ కు ఎన్నికల సంఘం 'బేటరీ టార్చ్​'ను గుర్తుగా కేటాయించింది. ఈ ఎన్నికల్లో తమిళనాడులో పోటీకి సిద్ధమవుతున్నాం. కొత్త తరం రాజకీయాల్లో మనం టార్చ్​ బేరర్​గా మారబోతున్నందుకు సంతోషంగా ఉంది.' అంటూ లోకనాయకుడు ట్వీట్​ చేశారు.

2018 ఫిబ్రవరి 21న కమల్‌ హాసన్‌ 'ఎమ్​ఐఎమ్'​ పార్టీని స్థాపించారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు తీసుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details