ఆమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌తో తన విడాకులు ఖరారు అయ్యాయని ఆయన భార్య మెకెంజీ ప్రకటించారు. తమ ఉమ్మడి షేర్లలో 75 శాతం ఆమెజాన్కే తిరిగిస్తున్నట్లు తెలిపారావిడ. ఇకపై సొంత ప్రణాళికతో ముందుకు సాగుతానన్నారు.
"జెఫ్‌తో నా విడాకుల ప్రక్రియ సజావుగా పూర్తయింది. మా వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు."- ట్విట్టర్లో మెకెంజీ బెజోస్
ఆమెజాన్ సంస్థలో ఉన్న తన వాటాలను (షేర్లను) తన మాజీ భర్త బెజోస్ ఆధ్వర్యంలోని వాషింగ్టన్ పోస్ట్, బ్లూ ఆరిజన్ (అంతరిక్ష పరిశోధన సంస్థ)లకే కేటాయిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. సంస్థ బోర్డులో తన ఓటు హక్కును కూడా త్యజిస్తున్నట్లు తెలిపారు.
విడాకుల అనంతరం ఆమె ప్రపంచంలో నాలుగో అత్యంత ధనవంతురాలుగా నిలవనున్నారు. ప్రస్తుతం ఆమెజాన్ కంపెనీ మొత్తం విలువ సుమారు 36 బిలియన్ డాలర్లు (రూ.2,44,800 కోట్లు). దీనిలో మెకంజీ వాటా 4 శాతం (యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజి కమిషన్ రికార్డుల ప్రకారం). ప్రస్తుతం ఆమెజాన్ సంస్థ ఒక్కో షేర్ విలువ 1,812 డాలర్లుగా కొనసాగుతోంది.