ఐఐటీ ప్రవేశాల కోసం నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 2 లక్షల 45వేల మంది ఎంపిక కాగా... అందులో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఈనెల 9వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. ఈనెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రుసుం చెల్లించవచ్చు. ఈనెల 20 నుంచి హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. 27న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుంది.
నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం - iit
నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈనెల 27న పరీక్ష జరగనుంది.
జేఈఈ అడ్వాన్స్డ్
తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీ, ఐఎస్ఎంలలోని సుమారు 11వేల ఇంజినీరింగ్ సీట్లు భర్తీ చేస్తారు.
ఇవీ చూడండి: ట్యాంక్‌బండ్‌పై అఖిలపక్ష నేతల అరెస్ట్
Last Updated : May 3, 2019, 7:49 AM IST