తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సూపర్​ మెజారిటీ దిశగా షింజో అబే ప్రభుత్వం - లిబరల్ డొమొక్రాటిక్​ పార్టీ

జపాన్ పార్లమెంట్​ ఎగువసభ ఎన్నికల్లో ప్రధాని షింజో అబే నేతృత్వంలోని లిబరల్​ డెమొక్రాటిక్​ పార్టీ మెజారిటీ సాధించింది. రాజ్యాంగ సవరణకు అవసరమైన సూపర్​ మెజారిటీకి కూడా చేరువలో ఉందని ఎగ్జిట్​పోల్స్​ వెల్లడిస్తున్నాయి.

సూపర్​ మెజారిటీ దిశగా షింజో అబే ప్రభుత్వం

By

Published : Jul 22, 2019, 8:22 AM IST

Updated : Jul 22, 2019, 9:02 AM IST

జపాన్ పార్లమెంట్​ ఎగువ సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి షింజో అబే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అత్యధిక మెజారిటీ సాధించినట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. రాజ్యాంగ సవరణకు అవసరమైన సూపర్​ మెజారిటీకీ అబే ప్రభుత్వం దగ్గర్లో ఉన్నట్లు ఎగ్జిట్​పోల్స్​ స్పష్టం చేస్తున్నాయి.

245 సీట్లున్న ఎగువ సభలో ఆదివారం 124 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండు గంటల ఓట్ల లెక్కింపు అనంతరం షింజో అబే నేతృత్వంలోని లిబరల్ డెమొక్రాటిక్​ పార్టీ, దాని భాగస్వామి కొమిటోలు ఎగువ సభలో 64 సీట్లు గెలుచుకున్నాయి.

ఈ సభ సభ్యులు ప్రధానమంత్రిని ఎన్నుకోలేరు. ప్రతి మూడేళ్లకి ఒకసారి ఈ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

రాజ్యాంగాన్ని సవరించాలంటే..

జపాన్​లో రాజ్యాంగ సవరణ చేయాలంటే.... పార్లమెంటులో 2/3 వంతుల మెజారిటీ అవసరం. అంటే 164 సీట్లు. ప్రస్తుతం షింజో అబే నేతృత్వంలోని పాలకపక్షానికి 64 సీట్లు ఉన్నాయి. అందువల్ల మరొక పార్టీ (కన్జర్వేటివ్​ పార్టీ), స్వతంత్ర అభ్యర్థుల మద్దతు సాధిస్తే కావలసిన 164 సీట్ల మెజారిటీ వస్తుంది.

అబే...విజయపరంపర

షింజో అబే... లిబరల్ డెమొక్రాటిక్ పార్టీని 2012 నుంచి వరుసగా 5 పార్లమెంటరీ ఎన్నికల్లోనూ విజయతీరాలకు చేర్చారు. అనిశ్చితంగా ఉన్న ప్రతిపక్షం కంటే నిలకడైన అబే ప్రభుత్వంపైనే ప్రజలు నమ్మకముంచారని ఎగ్జిట్​ పోల్స్​ చెబుతున్నాయి.

ఇదీ చూడండి: కర్ణాటకీయం: నేడే బలపరీక్ష-సర్వత్రా ఉత్కంఠ

Last Updated : Jul 22, 2019, 9:02 AM IST

ABOUT THE AUTHOR

...view details