తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కష్టాల మధ్య 'జెట్​ ఎయిర్​వేస్'​ ప్రయాణం! - fuel

జెట్​ ఎయిర్​వేస్ సంస్థకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తాజాగా బుధవారం ఇండియన్​ ఆయిల్ కార్పొరేషన్​ ఇంధన సరఫరాను నిలిపివేసింది. అనంతరం సరఫరా పునరుద్ధరించింది. సంస్థకు చెందిన బోయింగ్​ విమానాన్ని  ఆమ్‌స్టర్‌డామ్‌ విమానాశ్రయం వద్ద యూరోపియన్‌ కార్గో సర్వీసెస్‌ జప్తు చేసింది. సంస్థలో వాటా కొనుగోలుకు బిడ్ల దాఖలు గడువును మరో 2 రోజులు పొడిగించారు రుణదాతలు.

కష్టాల మధ్య 'జెట్​ ఎయిర్​వేస్'​ ప్రయాణం

By

Published : Apr 11, 2019, 7:43 AM IST

Updated : Apr 11, 2019, 7:50 AM IST

కష్టాల మధ్య 'జెట్​ ఎయిర్​వేస్'​ ప్రయాణం

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్​ ఎయిర్​ వేస్​ సంస్థ కోలుకునే పరిస్థితులు కనిపించటం లేదు. ఆ సంస్థ​కు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. బకాయిలు చెల్లించని కారణంగా బుధవారం టర్బైన్ ఫ్యూయల్​ (ఏటీఎఫ్​) సరఫరాను నిలిపేసిన ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​ సంస్థ... సాయంత్రం తిరిగి పునరుద్ధరించింది.

" బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి దేశవ్యాప్తంగా జెట్​ ఎయిర్​వేస్​కు ఇంధన సరఫరాను నిలిపేశాం. మా సంస్థతో చేసుకున్న బ్యాంకు గ్యారంటీ పరిమితులను ఉల్లంఘించిన నేపథ్యంలో చర్యలు తీసుకున్నాం." - ఐవోసీ.

జెట్​ ఎయిర్​వేస్​కు ఇంధన సరఫరాను నిలిపేయటం వారంలో ఇది మూడోసారి.

సంస్థకు చెందిన బోయింగ్​ విమానాన్ని ఆమ్‌స్టర్‌డామ్‌ విమానాశ్రయం వద్ద యూరోపియన్‌ కార్గో సర్వీసెస్‌ జప్తు చేసింది. జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటా కొనుగోలుకు ఆసక్తి ఉన్న వారు బిడ్లను దాఖలు చేసేందుకు గడువును శుక్రవారం వరకు పొడిగించారు రుణదాతలు. బుధవారమే ఈ గడువు ముగియాల్సి ఉంది.

జెట్‌ ఎయిర్‌వేస్‌ లీజులో 7 బోయింగ్‌ 737-800 విమానాలు ఉన్నాయి. వీటిని లీజుదారులు వెనక్కి తీసుకోవడానికి విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ అనుమతినిచ్చింది. ఈ నిర్ణయంతో విమానాలను దేశం నుంచి తీసుకెళ్లేందుకు, ఇతర సంస్థలకు అద్దెకు ఇచ్చుకునేందుకు అవకాశం లభించింది.

వీటికి తోడు 16 వేల మంది ఉద్యోగులకు మార్చి​ నెలలో జీతం అందలేదు. పైలట్లు, ఇంజినీర్లు, సీనియర్​ మేనేజ్​మెంట్​ అధికారులు జీతాల బకాయిల చెల్లింపుపై సంస్థకు ఇదివరకే లీగల్​ నోటీసులు అందించారు.

Last Updated : Apr 11, 2019, 7:50 AM IST

ABOUT THE AUTHOR

...view details