మరి కొన్నిరోజుల్లో వీవో ఐపీఎల్-2019 సీజన్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం దేశమంతా ఈ పొట్టి క్రికెట్ కోసం ఎదురుచూస్తోంది. మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. తాజాగా ఈ రెండు జట్ల మధ్య జరగబోయే రసవత్తర మ్యాచ్‌పై ఓ ప్రచార చిత్రం విడుదల చేసింది ఐపీఎల్ బోర్డు.
"ధోనీ, కోహ్లి అంటే పేర్లు మాత్రమే" - MATCH
ఈ నెల 23న ప్రారంభం కాబోయే ఐపీఎల్ మ్యాచ్‌పై ఓ వీడియో విడుదల చేసింది ఐపీఎల్ బోర్డు. ధోనీ, కోహ్లి మధ్య సరదాగా సాగే సంభాషణలతో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
ధోనీ-కోహ్లీ
ధోనీ, కోహ్లీ అంటూ.. ఇరు జట్ల అభిమానులు పోటీపడుతూ సరదాగా సాగుతోంది ఈ వీడియో. విరాట్, మహీ ప్రత్యక్షమై..."ధోనీ, కోహ్లీ అనేవి పేర్లు మాత్రమే.. ముందు ఆట చూపించు" అంటూ ఇద్దరి ఆటగాళ్ల మధ్య జరిగే సంభాషణతో వీడియో పూర్తవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Last Updated : Mar 14, 2019, 9:51 PM IST