IPL 2022: దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులే చేయగలిగింది. డేవిడ్ వార్నర్ 66 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. పంత్ 34 పరుగులు చేశాడు. ఆర్‌సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్ 3, మహ్మద్ సిరాజ్ 2, హసరంగా ఒక వికెట్ తీశాడు
IPL 2022: దిల్లీపై గెలిచిన బెంగళూరు.. రాణించిన దినేశ్ కార్తీక్ - ఐపీఎల్ న్యూస్
IPL 2022: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తిరిగి గెలుపు బాట పట్టింది. దిల్లీ క్యాపిటల్స్‌పై 16 పరుగుల తేడాతో గెలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. దిల్లీ ముందు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూరు జట్టులో దినేశ్ కార్తిక్ (66* : 34 బంతుల్లో 5×4, 5×6) మెరుపు ఇన్నింగ్స్‌తో మరోసారి సత్తా చాటాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే దూకుడుగా ఆడిన దినేశ్ కార్తిక్.. ముస్తాఫిజుర్ రహ్మాన్ వేసిన 18వ ఓవర్లో మరింత చెలరేగిపోయాడు. ఏకంగా నాలుగు ఫోర్లు, రెండు సిక్సులు బాది.. ఒకే ఓవర్లో 28 పరుగులు రాబట్టాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (55 : 34 బంతుల్లో 7×4, 2×6) అర్ధ శతకంతో రాణించాడు. షాబాజ్ అహ్మద్ (32*) కూడా ఆఖర్లో ధాటిగా ఆడాడు. కెప్టెన్ డు ప్లెసిస్ (8), అనుజ్ రావత్ (0), విరాట్ కోహ్లీ (12), సుయశ్ ప్రభుదేశాయ్ (6) విఫలమయ్యారు. దిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
ఇదీ చదవండి:99 మ్యాచ్‌లు.. రెండో స్థానంలో రాహుల్.. టాప్‌లో ఎవరంటే?