తెలంగాణ

telangana

ETV Bharat / briefs

నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం

అమ్మా...అని పిలుపు చాలు. మది పులకించిపోతుంది. మనసు కరిగిపోతుంది. నేనున్నా అంటూ అక్కున చేర్చుకుని.. ప్రేమ కురిపిస్తుంది, బాధ ఉంటే... పంచుకుంటుంది. ఇలాంటి ప్రేమకు ప్రతిరూపంగానే అంతర్జాతీయ మాతృ దినోత్సవం జరుపుకుంటారు. ఇంతకీ ఈ పండుగ ఎప్పుడు మెుదలైంది...? ఎందుకు నిర్వహిస్తారు...?

మాతృ దినోత్సవం

By

Published : May 12, 2019, 8:12 AM IST

అమెరికాలో మెుదటిసారి మాతృదినోత్సవం నిర్వహించేవారు. సమాజంలో తల్లి పాత్ర, ఆమె చేసే నిస్వార్థ సేవ గుర్తు చేసుకోవడం కోసం ఏటా మే రెండో ఆదివారం జరిపేవారు. మెుదట మహిళా సంఘాలకే పరిమితమైన ఈ వేడుకలు..అంతటికి వ్యాపించాయి.

వర్జినీయాలో మెుదటిసారి

మేరీ జార్వీస్​ అనే అమెరికన్ మహిళ కృషి ఫలితమే... ఈ మదర్స్​ డే. తన ఆశయం నెరవేరకుండానే...కన్నుమూసిన తల్లిని తలుచుకోవడం కోసం మదర్స్​ డే ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఆమెకొచ్చింది. దీనికి విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు చాలా కృషి చేసింది. మాతృ దినోత్సవాన్ని అంతర్జాతీయ సేవల దినోత్సవంగా ప్రకటించాలని జార్వీస్ తీవ్ర ప్రయత్నం చేసింది. ఆమెతోపాటు చాలమంది నడిచారు. 1910లో తొలిసారి పశ్చిమ వర్జీనియాలో మదర్స్ డేను సెలవు దినంగా ప్రకటించారు.

అమెరికాలో చట్టం

వర్జీనియా తర్వాత అమెరికాలోని చాలా రాష్ట్రాలూ ఈ మదర్స్ డేను అనుసరించాయి. 1914 మే 8న అమెరికా కాంగ్రెస్..మే నెలలో రెండో ఆదివారాన్ని మాతృదినోత్సవంగా ప్రకటిస్తూ...చట్టం చేసింది. ఈ విషయాన్ని మరుసటి రోజు..అప్పటి అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ అధికారికంగా ప్రకటించారు.

భారత్​లో మదర్స్ డే

భారత్​లో దాదాపు పదేళ్లుగా ఈ మదర్స్​ డే సంస్కృతి ఎక్కువైంది. ప్రపంచీకరణ, పాశ్చాత్య పోకడ, భారతీయులు అమెరికాలో అధికంగా ఉండటమే ఇందుకు కారణం. ఇంటర్నెట్, శాటిలైట్ విప్లవం లాంటివి భారత్​లో మదర్స్​ డే జరిగేందుకు కారణమయ్యాయి. భారత్​లో ఇతర రోజులను ఎక్కువగా విమర్శిస్తుంటారు..కానీ...మాతృ దినోత్సవాన్ని విమర్శించేవారు చాలా తక్కువ మంది.

ఇదీ చూడండి : మాతృదినోత్సవం నాడు అమ్మతో సరదాగా

ABOUT THE AUTHOR

...view details