తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మార్కులు పెరిగితే ఫీజు వెనక్కి ఇచ్చేస్తాం: విద్యాశాఖ

ఇంటర్మీడియట్​ ఫలితాల్లో జరిగిన అవకతవకల వల్ల వెల్లువెత్తిన ఆందోళనలపై ప్రభుత్వం స్పందించింది. ప్రశ్నాపత్రాలు పునఃపరిశీలన చేస్తామని, మార్కులు పెరిగితే విద్యార్థుల చెల్లించిన రుసుము కూడా తిరిగిచ్చేస్తామని విద్యాశాఖ తెలిపింది. ఇప్పటి వరకూ ఈ విధానం లేదు. ఈ నిర్ణయం వేలాది మంది విద్యార్థులకు ఊరటనిస్తోంది.

inter-students

By

Published : Apr 26, 2019, 12:01 PM IST

ప్రతిభావంతులైన విద్యార్థులకు ఊరటనిచ్చే నిర్ణయం విద్యాశాఖ తీసుకుంది. ఇంటర్​ జవాబు పత్రాల పున పరిశీలనలో విద్యార్థుల మార్కులు పెరిగితే వారు చెల్లించిన రుసుము వెనక్కి ఇస్తామని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్​రెడ్డి తెలిపారు. పరీక్ష తప్పిన వారికి ఉచితంగా పునఃపరిశీలన చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఎన్నిమార్కులొస్తే వెనక్కి ఇస్తారు..?

ప్రస్తుతం పునఃపరిశీలన కోసం ఒక్కో జవాబు పత్రానికి రూ.600 చెల్లించాలి. మొత్తం ఆరు పేపర్లకు రూ.3600 కట్టాల్సి ఉంటుంది. పునఃపరిశీలనలో విద్యార్థుల మార్కులు పెరిగితే జవాబు పత్రాలు దిద్దిన అధ్యాపకుల తప్పు తీవ్రతను బట్టి రెండు నుంచి 20వేల రూపాయల వరకూ ఇంటర్​ బోర్డు జరిమానా విధిస్తుంది. మార్కులు పెరిగితే విద్యార్థులు చెల్లించిన రుసుము తిరిగి ఇచ్చేస్తామన్న విద్యాశాఖ ఎన్ని మార్కులు పెరిగితే చెల్లిస్తామన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు.

ఇప్పటికే 75వేల దరఖాస్తులు

ఏటా పునఃపరిశీలన నిమిత్తం 18 నుంచి 20 వేల దరఖాస్తులు వస్తాయి. ఈసారి గురువారానికే 75 వేల దరఖాస్తులు వచ్చాయి. అందులో 8వేలు మరోసారి లెక్కింపుకోసం వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. విద్యాశాఖ తీసుకున్న తాజా నిర్ణయంతో మరిన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

27లోగా సప్లిమెంటరీ ఫీజు చెల్లించాలి

ఇంటర్​ పరీక్షల్లో తప్పినా, తక్కువ మార్కులొచ్చినా ఇంప్రూవ్​మెంటు కోసం పరీక్ష రాయదలుచుకున్నవారు సప్లిమెంటరీ రుసుము ఎప్పటిలాగే వారి కళాశాలలో ఈ నెల 27తేదీలోగా చెల్లించాలని ఇంటర్​బోర్డు కార్యదర్శి అశోక్​ వెల్లడించారు.

మార్కులు పెరిగితే మీ డబ్బులు మీకే

ఇదీ చదవండి: ఇంటర్ అవకతవకలపై నివేదిక సిద్ధం... మిగిలింది చర్యలే

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details