రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు కారణమైన ఇంటర్ ఫలితాల వ్యవహారంలో.. త్రిసభ్య కమిటీ రేపు ఉదయం విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి నివేదిక సమర్పించనుంది. మూడు రోజులుగా సుదీర్ఘంగా విచారించిన కమిటీ గ్లోబరీనా సామర్థ్యం, టెండర్ల ప్రక్రియలో అనుసరించిన విధానం, ఇంటర్ బోర్డు పర్యవేక్షణ లోపం వంటి అంశాలపై నిశీత పరిశీలన చేసింది. వీటన్నింటిపై 12 పేజీల నివేదికతో పాటు, మరో 150 పేజీలతో కూడిన 12 అంశాలపై సుధీర్ఘ వివరణ ఇవ్వనుంది. గ్లోబరీనాతోపాటు ఇంటర్ బోర్డులోనూ లోపాలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది.
రేపు ప్రభుత్వానికి 'ఇంటర్' త్రిసభ్య కమిటీ నివేదిక - telangana inter mediate
ఇంటర్ ఫలితాల్లో తలెత్తిన అవకతవకలపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ రేపు నివేదిక సమర్పించనుంది. గ్లోబరీనాతో పాటు బోర్టులోని లోపాలను సర్కారు దృష్టికి తీసుకురానుంది.
త్రిసభ్య కమిటీ నివేదిక
Last Updated : Apr 26, 2019, 11:32 PM IST