ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరుకాని కొందరు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. 21 వేల మంది విద్యార్థుల వివరాలు గల్లంతయినట్లు కొందరు ప్రచారం చేయడాన్ని బోర్డు కార్యదర్శి అశోక్ తప్పుపట్టారు. అందరి వివరాలు తమ వద్ద భద్రంగా ఉన్నాయని తెలిపారు. మూల్యాంకనం విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అన్ని అర్హతలు ఉన్నవారితోనే జవాబుపత్రాలు మూల్యాంకనం చేయించామని బోర్డు కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు.
ఆ వార్తలు అవాస్తవం: ఇంటర్ బోర్డు
ఇంటర్ మూల్యాంకనం విషయంలో ఎవరు ఆందోళన చెందవద్దని బోర్టు కార్యదర్శి అశోక్ స్పష్టం చేశారు. ఏ విద్యార్థి వివరాలు గల్లంతుకాలేదని.. తమ వద్ద భద్రంగా ఉన్నాయని తెలిపారు.
ఆ వార్తలు అవాస్తవం: ఇంటర్ బోర్డు