రీవెరిఫికేషన్ ఫలితాల్లోనూ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అయోమయం సృష్టిస్తోంది. ఇంటర్ రీవెరిఫికేషన్ ప్రక్రియలో ఎంతోమంది పునఃసమీక్షించారని చెప్పారు బోర్డు కార్యదర్శి అశోక్. కానీ రీవెరిఫికేషన్లోనూ తప్పు జరిగిందని చెప్పడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇంటర్లో ఫెయిలైన అనామిక (ఆత్మహత్యకు పాల్పడిన అమ్మాయి)కు 48 మార్కులు వచ్చినట్లు తప్పుగా పేర్కొన్నామని స్పష్టం చేశారు. గతంలో 20 మార్కులు రాగా.. రీవెరిఫికేషన్‌లో ఒక్క మార్కు పెరిగి మొత్తం 21 మాత్రమే వచ్చాయని తెలిపారు. మూల్యాంకన కేంద్రంలో క్లరికల్ సిబ్బంది పొరపాటు వల్ల ఈ గందరగోళం తలెత్తిందని, అతనిపై చర్యలు కూడా తీసుకున్నామన్నారు. ఎవరికి ఎలాంటి అనుమానం ఉన్నా జవాబు పత్రాన్ని చూడాలని అశోక్ వెల్లడించారు.
రీవెరిఫికేషన్లోనూ తప్పు జరిగింది: బోర్డు కార్యదర్శి - ANAMIKA
అనామికకి 21 మార్కులు మాత్రమే వచ్చాయి. వెబ్సైట్లో చూపించినట్లుగా 48 రావడం అబద్ధం. క్లరికల్ సిబ్బంది పొరపాటు వల్లే ఈ తప్పిదం జరిగింది. అతనిపై చర్యలు తీసుకుంటున్నాం: అశోక్, బోర్డు కార్యదర్శి
రీవెరిఫికేషన్లోనూ తప్పు జరిగింది: అశోక్, బోర్డు కార్యదర్శి
Last Updated : Jun 4, 2019, 9:09 PM IST