తెలంగాణ

telangana

ETV Bharat / briefs

జట్టుగా రాణించారు.. విజయం సాధించారు - కెనడా హకీ జట్టు

మలేషియాలో జరుగుతున్న అజ్లాన్ షా హాకీ టోర్నీలో కెనడాపై భారత హాకీ జట్టు గెలుపొందింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.

అజ్లాన్ షా హాకీ టోర్నీలో కెనడా జట్టుపై విజయం సాధించిన భారత పురుషులు హాకీ జట్టు

By

Published : Mar 27, 2019, 6:41 PM IST

మలేషియా వేదికగా జరుగుతున్న సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నీలో భారత జట్టు విజయ పరంపర కొనసాగుతోంది. కెనడాతో జరిగిన మ్యాచ్​లో 7-3 గోల్స్ తేడాతో గెలుపొందింది. ఇప్పటి వరకు ఆడిన నాలుగింటిలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. రెండో స్థానంలో దక్షిణ కొరియా ఉంది.

భారత జట్టు ఆడిన తొలి మ్యాచ్​లో జపాన్​ను 2-0 తేడాతో ఓడించింది. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్​ను 1-1తో డ్రా చేసుకుంది. మూడో మ్యాచ్​లో మలేషియాను 4-2 తేడాతో ఓడించింది. నామమాత్రమైన తర్వాతి మ్యాచ్​లో పోలాండ్​ను ఢీకొట్టనుంది భారత హాకీ జట్టు.

ABOUT THE AUTHOR

...view details