బ్యాట్స్మెన్ విఫలమాయె.. సిరీస్ పోయె - one day
బ్యాట్స్మెన్ విఫలమవడం వల్ల ఐదో వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. వన్డే సిరీస్ను చేజార్చుకుంది. ఖవాజా సెంచరీ చేసి ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఆస్ట్రేలియా విజయం
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదో వన్డేలో కోహ్లీసేన పరాజయం పాలైంది. ఐదు వన్డేల సిరీస్ 2-3 తేడాతో ఆసీస్ కైవసం చేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కంగారు జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 272 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో తడబడిన భారత్ 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివర్లో కేధార్, భువనేశ్వర్ పోరాడిన ఓటమి నుంచి కాపాడలేకపోయారు. ఉస్మాన్ ఖవాజా శతకంతో కదం తొక్కి ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు
Last Updated : Mar 13, 2019, 11:03 PM IST