తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'దివ్యాంగులకు కల్యాణలక్ష్మి సహాయం పెంపు'

దివ్యాంగులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా అందించే సాయం పెరిగింది. ఇక నుంచి సాధారణ లబ్ధిదారుల కంటే దివ్యాంగులకు 25శాతం అధిక సహాయం అందనుంది.

దివ్యాంగులు

By

Published : Jun 29, 2019, 7:55 PM IST

'దివ్యాంగులకు కల్యాణలక్ష్మి సహాయం పెంపు'

తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కింద వివాహం కోసం ఇచ్చే ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. సాధారణ లబ్ధిదారుల కంటే దివ్యాంగులకు 25శాతం మొత్తాన్ని అధికంగా ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర చట్టానికి లోబడి ఆర్థిక సాయాన్ని పెంచుతూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. సాధారణంగా కల్యాణ లక్ష్మి అర్హులకు లక్షా 116 రూపాయల సాయం అందుతుండగా... ఇక నుంచి దివ్యాంగ పెళ్లికూతురు తల్లిదండ్రులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయం లక్షా 25వేల 145 రూపాయల సాయం అందనుంది.

ABOUT THE AUTHOR

...view details