తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఈడీ విచారణకు వాద్రా - bikanar land allotment

ఇండియా- పాకిస్థాన్​ సరిహద్దులోని సున్నిత ప్రాంతమైన రాజస్థాన్​లోని బికనేర్​లో భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్​ వాద్రాను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ ప్రశ్నించింది.

రాబర్ట్​ వాద్రా

By

Published : Feb 12, 2019, 7:05 PM IST

రాజస్థాన్ సరిహద్దులోని బికనేర్​​ పట్టణంలో భూ కేటాయింపుల కేసు విచారణ కోసం రాబర్ట్​ వాద్రా, ఆయన తల్లి మౌరిన్​లు జైపూర్​లోని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ)​కు హాజరయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఆయన భార్య ప్రియాంక గాంధీ అతనితో పాటు ఈడీ కార్యాలయానికి వచ్చారు.

ఈడీ ముందు హాజరవడం వాద్రాకు నాలుగోసారి కాగా, జైపూర్​లో ఇదే మొదటిది. మనీ లాండరింగ్​ కేసు విచారణ కోసం మూడుసార్లు దిల్లీలో కార్యాలయంలో హాజరయ్యారు వాద్రా.

బికనేర్​ కేసులో ఇంతకుముందే వాద్రాకు మూడు సార్లు సమన్లు జారీ చేశారు. అయినప్పటికీ ఆయన విచారణకు హాజరుకాలేదు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈడీని ఆదేశించాలని వాద్రా, ఆయన తల్లి రాజస్థాన్​ కోర్టును ఆశ్రయించారు. ఈడీకి సహకరించాలని న్యాయస్థానం ఆదేశించడం వల్ల విచారణకు హాజరయ్యారు.

ఇదీ కేసు...

రాజస్థాన్​లోని పాకిస్థాన్​ సరిహద్దు సమీపంలో ఉన్న ప్రాంతం బికనేర్​. ఇక్కడ భూమి కేటాయింపులో ఫోర్జరీ జరిగిందని తహశీల్దారు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లు, ప్రాథమిక సమాచార నివేదికల ఆధారంగా ఈడీ 2015లో క్రిమినల్​ కేసు నమోదు చేసింది.

'ఎమ్​ఎస్​ స్కైలైట్​ హాస్పిటాలిటీ ప్రైవేటు లిమిటెడ్​' ఇక్కడ భూములను కొనుగోలు చేసింది. ఈ సంస్థతో వాద్రాకు సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. సంస్థ వ్యవహారాల గురించి తెలుసుకోవటానికి ఈడీ వాద్రాను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details