ఎమ్మెల్యే, ఎంపీ ఒకే పార్టీ వారైతే అభివృద్ధి వేగంగా జరుగుతుందని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ లోక్‌సభ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమయ్యాయని కొనియాడారు. శాసనసభ ఎన్నికల మాదిరే పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. భారీ మెజార్టీతో పసునూరిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పదహారు స్థానాలు గెలిస్తే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని పసునూరి దయాకర్ అభిప్రాయపడ్డారు. వరంగల్ ప్రజలు తనను మరోసారి ఎంపీగా పార్లమెంట్‌కు పంపించాలని అభ్యర్థించారు.
ఎమ్మెల్యే, ఎంపీ మనోళ్లయితే మరింత వేగంగా అభివృద్ధి - mp
శాసనసభ్యుడు, ఎంపీ ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వ్యక్తులైతే ఆ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు కడియం శ్రీహరి. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు మద్దతుగా ఆయన ప్రచారం చేపట్టారు.
కడియం