తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పట్టువదలని విక్రమార్కుడిలా అనుకున్నది సాధించాడు - RANKER

మారుమూల వెనకబడిన ప్రాంతంలో పుట్టినా.. ఉన్నత చదువులు చదివాడు. కార్పోరేటు సంస్థలో మంచి ఉద్యోగమూ సంపాదించాడు. ఇవేవీ అతనికి సంతృప్తినివ్వలేదు. జనం కోసం ఏదైనా చెయ్యాలన్న తపనతో సివిల్స్​ని లక్ష్యంగా ఎంచుకున్నాడు. అంతే పట్టుదలతో అఖిల భారత స్థాయిలో సివిల్​ సర్వీసెస్​లో 57వ ర్యాంకు సాధించాడు షాహిద్​.

పట్టువదలని విక్రమార్కుడిలా అనుకున్నది సాధించాడు

By

Published : Apr 15, 2019, 5:31 PM IST

నాగర్​ కర్నూల్​ జిల్లా అచ్చంపేటకు చెందిన మహ్మద్​ అబ్దుల్​ షాహిద్​... సివిల్స్​ కోసం మూడుసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయినా పట్టు వదల్లేదు. ఈ ఏడాది జాతీయ స్థాయిలో ఐఎఫ్​ఎస్​ 45వ ర్యాంకు సాధించాడు. సివిల్స్​ నాలుగో ప్రయత్నంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. అఖిల భారత స్థాయిలో సివిల్​ సర్వీసెస్​లో 57వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. ఐఏఎస్ అధికారిగా ప్రజలకు సేవ చేస్తానంటూనే.. తనలాగే సివిల్స్ లక్ష్యంగా ఎంచుకున్న వాళ్లకూ తన వంతు సహకారం అందిస్తాన్నంటున్నా షాహిద్​తో మా ప్రతినిధి స్వామి కిరణ్ ముఖాముఖి..

షాహిద్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details