తనని గెలిపిస్తే నాగర్‌కర్నూల్‌ను స్మార్ట్ సిటీగా మారుస్తానన్నారు భాజపా ఎంపీ అభ్యర్థి బంగారు శ్రుతి. జిల్లాలోని కొల్లాపూర్‌లో భాజపా కార్యకర్తల సమావేశానికి ఆమె హాజరయ్యారు. దేశభద్రత కోసం మరోసారి కమలం పార్టీకి పట్టం కట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో రాష్ట్రం అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. మాటలగారడీతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేకుండా పోయిందని ఆరోపించారు. నాగర్‌కర్నూల్ ఎంపీగా తనకు ఓటు వేసి ఆదరించాలన్నారు.
నాగర్‌కర్నూల్‌ను స్మార్ట్ సిటీగా మారుస్తా: శ్రుతి - ngkl
దేశ ప్రజలు మరోసారి మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి బంగారు శ్రుతి అన్నారు.
బంగారు శ్రుతి