తెలంగాణ

telangana

ETV Bharat / briefs

న్యూజిలాండ్​ కాల్పుల ఘటనలో నగరవాసి - ktr

న్యూజిలాండ్​ క్రైస్ట్‌చర్చ్‌లోని మసీదుల్లో జరిగిన కాల్పుల ఘటనలో నగరానికి చెందిన తాజ్​ అహ్మద్ జహంగీర్​ తీవ్రగాయాలపాలయ్యాడు. దుండగుడు దాడిని ప్రత్యక్ష ప్రసారం చేసి తన కర్కశత్వాన్ని ప్రదర్శించాడు.

కాల్పులు

By

Published : Mar 15, 2019, 9:55 PM IST

న్యూజిలాండ్​లో క్రైస్ట్​చర్చ్​లోని ఓ మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారే లక్ష్యంగా ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్​ అంబర్​పేటకు చెందిన తాజ్​ అహ్మద్ జహంగీర్ తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటనలో 49 మంది మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. జహంగీర్ సమాచారం తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

దారుణాన్ని లైవ్​లో రికార్డు చేసి...

కాల్పులకు తెగబడ్డ కిరాతకుడు 17 నిమిషాలు లైవ్​స్ట్రీమింగ్ చేశాడు. కారులో వచ్చిన దుండగుడు మొదట ఆయుధాలు చూపించి... విచక్షణా రహితంగా కనిపించిన ప్రతిఒక్కరినీ కాల్చేశాడు. అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు ఇదంతా లైవ్​లో రికార్డు అయింది.

కాల్పుల్లో నగరవాసి..

జహంగీర్ 15 ఏళ్ల క్రితం ఉపాధి కోసం న్యూజిలాండ్​ వెళ్లాడు. అక్కడ ఓ రెస్టారెంట్​ ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. వివాహితుడైన జహంగీర్​కు ఇద్దరు పిల్లలు. టీవీల ద్వారా కాల్పుల విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఆరాతీశారు.

బాధిత కుటుంబానికి అండగా..​

ఈ విషయం తెలుసుకున్న ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రియాజ్‌ ఉల్‌ హసన్‌ అఫండి కుటుంబ సభ్యులను ఓదార్చారు. జహంగీర్​ను కాపాడాలంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ట్వీట్‌ చేశారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ట్విట్టర్‌ ద్వారా ఒవైసీ సాయం కోరారు.ఈ విషయంపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని తమకు సాయం చేయాలని బాధితుని తరఫు బంధువులు కోరుతున్నారు.

ఇవీ చూడండి:అసదుద్దీన్​, కేటీఆర్​ మధ్య ట్వీట్ల సంభాషణ

ABOUT THE AUTHOR

...view details