అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మలక్పేట నియోజకవర్గం చంచల్గూడకు చెందిన యువకుడు వాసిం దుర్మరణం చెందాడు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బే వ్యూ దగ్గరలోని పౌల్ అవెన్యూ వద్ద ఆదివారం తెల్లవారుజామున వాసిం వెళ్తున్న కారును మరో కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో వాసిం అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవ్యక్తి కూడా మృతి చెందినట్లు ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్మదుల్లా ఖాన్ తెలిపారు. మృతదేహాన్ని భారత్కు రప్పించేందుకు సహాయం చేయాలని విదేశాంగ శాఖ మంత్రిని కుటుంబసభ్యులు కోరుతున్నారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ వాసి మృతి - accident]
అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. వాసిం అనే యువకుడు వెళ్తున్న కారును మరోకారు ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగినట్లు ఎంబీటీ అధికార ప్రతినిధి తెలిపారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ వాసి మృతిరోడు ప్రమాదంలో వాసిం మృతి