తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'హత్యా రాజకీయాలు చేస్తున్నారు' - విజయసాయిరెడ్డి

వైఎస్ కుటుంబాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు తెదేపా ప్రయత్నిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. వివేకా హత్య వెనక చంద్రబాబు, లోకేశ్​ ఉన్నారన్నారు.

ఎంపీ విజయసాయిరెడ్డి

By

Published : Mar 15, 2019, 8:03 PM IST

Updated : Mar 16, 2019, 7:22 AM IST

ఎంపీ విజయసాయిరెడ్డి
జగన్ చిన్నాన్నవై.ఎస్.వివేకానందరెడ్డిని వైకాపా వాళ్లే హత్య చేయించారని డీజీపీ చెప్తుతున్నారంటూ ఆ పార్టీఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇలాంటి అసత్యాలు చెబుతుంటే ఏపీ పోలీసులను ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. ఆంధ్రాపోలీసులు చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటున్నారన్నారు. తెదేపా హత్యా రాజకీయాలు చేస్తోందన్న విజయసాయిరెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.హత్య కేసు సూత్రధారులు చంద్రబాబు, లోకేశ్ అయితే అమలుచేసింది ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. వివేకానందరెడ్డి మరణంపై పూర్తి విచారణ చేపట్టేందుకు కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్​తోకేంద్రానికి, రాష్ట్రానికి లేఖ రాశామని ఎంపీ తెలిపారు.
Last Updated : Mar 16, 2019, 7:22 AM IST

ABOUT THE AUTHOR

...view details