తెలంగాణ

telangana

ETV Bharat / briefs

జీఎస్టీ అక్రమాలలో పిటిషనర్లకు ఊరట - fake invoice

జీఎస్టీ చెల్లింపుల వ్యవహారంలో వ్యాపారులకు ఊరట లభించింది. తుది తీర్పు ఇచ్చే వరకూ పిటిషనర్లను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది.

కోర్టు తీర్పుతో వ్యాపారులకు ఊరట

By

Published : Mar 19, 2019, 3:57 PM IST

Updated : Mar 19, 2019, 5:37 PM IST

డొల్ల కంపెనీలను సృష్టించి నకిలీ ఇన్ వాయిస్​లతో ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ పొందినట్లు ఇటీవల జీఎస్టీ తనిఖీల్లో తేలింది. అక్రమాలకు పాల్పడ్డారంటూఇద్దరు వ్యాపారులను అరెస్టు చేసి, మరికొందరికి సమన్లు జారీ చేశారు. అధికారుల తీరును సవాల్ చేస్తూ సుజన యూనివర్సల్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ శ్రీనివాసరాజు, హిందూస్థాన్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ వెంకట సత్య ధర్మావతార్, ఇన్ఫినిటి మెటల్స్ డైరెక్టర్ రమణారెడ్డి, మరో నలుగురు హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. వీటిపై కోర్టులో వాదనలు ముగిశాయి.


తీర్పు వచ్చే వరకూ వేచిచూడండి


చెల్లించిన జీఎస్టీ విలువకే ఐటీసీ పొందినట్లు పిటిషనర్లు వాదించారు. అధికారులు కనీసం నోటీసు ఇవ్వకుండా అరెస్టులు చేశారని తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడయ్యే వరకు పిటిషనర్లను అరెస్టు చేయవద్దని జీఎస్టీ అధికారులకు ఆదేశించింది.

ఇదీ చదవండి:అమల్లోకి తగ్గించిన జీఎస్టీ !

Last Updated : Mar 19, 2019, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details