ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులకు దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ 'టెక్‌బీ' పేరుతో 12 నెలలు కోర్సును అందుబాటులోకి తెచ్చింది. ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి అదే సంస్థలో ప్రవేశస్థాయి ఉద్యోగాలు పొందవచ్చిని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ కోర్సులో చేరాలంటే రూ. 2 లక్షల ఫీజు చెల్లించాలి. అది కూడా ఒకేసారి చెల్లించనవసరం లేదు. ఉద్యోగం లభించిన అనంతరం ఈఎంఐ ద్వారా చెల్లించే వెసులుబాటును కల్పించారు. అంతే కాకుండా విద్యార్థులకు ఉపకార వేతనం కూడా అందిస్తామన్నారు.
ఎవరు అర్హులు..?
ఇంటర్లో మాథ్స్ సబ్జెట్గా ఉండి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సుకు అర్హులు. ప్రవేశపరీక్ష, ఇంటర్య్వూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయనున్నారు. రెండేళ్ల కిందట ప్రారంభమైన ఈ కోర్సు ప్రస్తుతం తమిళనాడు, ఉత్తరప్రదేశ్లో విజయవంతగా కొనసాగుతున్నట్లు హెచ్‌సీఎల్ సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు శ్రీమతి శివశంకర్ తెలిపారు.