తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సర్పంచ్​, ఎంపీటీసీ నాకు రెండు కళ్లు: హరీశ్​రావు - సర్పంచ్​, ఎంపీటీసీలు

సిద్దిపేట జిల్లా రాఘవపూర్​లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే హరీశ్​రావు పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

హరీశ్​రావు

By

Published : May 3, 2019, 7:56 AM IST

సర్పంచ్​, ఎంపీటీసీలు తనకు రెండు కళ్లలాంటి వారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు వ్యాఖ్యానించారు. జిల్లాలోని రాఘవపూర్ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్​ నుంచి సిద్దిపేట మీదుగా వేములవాడ వరకు త్వరలోనే రైలు మార్గం రాబోతుందని ఆయన తెలిపారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు.

ఎన్నికల ప్రచారంలో హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details