కన్నీటి సంద్రంలో గోవా - గోవా
సీఎం మనోహర్ పారికర్ మరణంతో గోవా ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.
కన్నీరు పెట్టుకుంటున్న ప్రజలు
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మృతి పట్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మరణ వార్త విని పారికర్ నివాసానికి ప్రజలు భారీగా చేరుకున్నారు. అభిమానులు బోరున విలపిస్తున్నారు. తమ ప్రియతమ నేత ఇక లేరని తెలిసి ఆవేదన చెందుతున్నారు. ఆయన తమ హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారంటూ కన్నీళ్లతో చెబుతున్నారు. పనాజీలోని పారికర్ నివాసం, గోవా మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రతా ఏర్పాటు చేశారు.
Last Updated : Mar 18, 2019, 7:45 AM IST