తెలంగాణ

telangana

ETV Bharat / briefs

భువనగిరిలో ఆకట్టుకున్న ఆవిర్భావ వేడుకలు - భువనగిరిలో ఆకట్టుకున్న ఆవిర్భావ వేడుకలు

రాష్ట్ర ఆవిర్భాల వేడుకలు ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఆవిర్భావ వేడుకలు

By

Published : Jun 2, 2019, 7:38 PM IST

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని భువనగిరిలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ నేనావత్ బాలు నాయక్ పాల్గొని జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఉత్సవాల్లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే సునీత హాజరయ్యారు. అనతి కాలంలోనే రాష్ట్రం అద్భుత విజయాలు సాధించిందని బాలు నాయక్​ హర్షం వ్యక్తం చేశారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వ్యవసాయశాఖ, ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ, తదితర శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ పలువురిని ఆకర్షించాయి. స్కూల్ పిల్లలు, పెద్దలు, అధికారుల తో కళాశాల మైదానంలో సందడి వాతావరణం నెలకొంది.

ఆవిర్భావ వేడుకలు

ABOUT THE AUTHOR

...view details