అందరి సహకారంతోనే అటవీసంపదను కాపాడుకోగలమని సంగారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గుమ్మడిదల మండలం ముంబాపూర్లో కళాప్రదర్శనతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని వెంకటేశ్వర్లు కోరారు. అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని పేర్కొన్నారు.
అందరి సహకారంతోనే అడవుల సంరక్షణ
ప్రతి ఐదేళ్లకు ఒక డిగ్రీ ఉష్ణోగ్రత అధికమవుతోందని... 25 ఏళ్ల తర్వాత 50డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలను ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు అందరూ ముందడుగేయాలని కోరుతున్నారు.
అందరి సహకారంతోనే అడవుల సంరక్షణ