తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అక్కడ సంవత్సరం అంటే 31 గంటలే...

అదో భారీ గ్రహం. నిప్పులు కక్కే వేడి, భయంకరమైన రేడియేషన్... అక్కడ సర్వసాధారణం. ఆ గ్రహం కేవలం 1.3 రోజుల్లో నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుంది. అంటే... 31 గంటల్లోనే ఒక సంవత్సర కాలం పూర్తవుతుంది.

నెఫ్టూన్​ ఎడారిలో 'నిషిద్ధ గ్రహం'

By

Published : May 31, 2019, 7:00 PM IST

Updated : May 31, 2019, 8:10 PM IST

నెఫ్టూన్​ ఎడారిలో 'నిషిద్ధ గ్రహం'

విశ్వం, దాని పరిణామం, నక్షత్రాలు, సౌరవ్యవస్థ... వీటి గురించి ఇప్పటివరకు మన శాస్త్రవేత్తలకు ఉన్న పరిజ్ఞానాన్ని తాజాగా ఓ సరికొత్త గ్రహం సవాల్​ చేస్తోంది. విశ్వంపై నిశిత దృష్టిపెట్టిన ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా సౌరమండలం వెలుపల 'నెప్ట్యూనియన్ ఎడారి'లో ఓ గ్రహాన్ని కనిపెట్టారు.

'రాయల్​ ఆస్ట్రోనమికల్​ సర్వే' మేగజిన్... శాస్త్రవేత్తలు 'ఎన్​జీటీఎస్-4బి' అనే నూతన గ్రహం కనిపెట్టినట్లు కథనం ప్రచురించింది. 'ఫర్బిడెన్ ప్లానెట్(విస్మృత గ్రహం)' అని దీనికి నామకరణం చేశారు. ఈ గ్రహం తన మాతృ నక్షత్రం చుట్టూ అత్యంత సమీపంలో పరిభ్రమిస్తుండడాన్ని గమనించారు. దీనిపై అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రత, రేడియేషన్​లు ఉండటం వల్ల జీవులకు ఆవాస యోగ్యంకాదు.

భూమికి మూడు రెట్లు...

భూమికి మూడు రెట్లు ఉన్న ఈ గ్రహం.. మన నుంచి 920 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీనిపై వార్విక్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞులు అధ్యయనం చేస్తున్నారు.

"ఈ గ్రహం తన మాతృ నక్షత్రానికి అత్యంత సమీపంలో ఉంది. తన కక్ష్యలో పరిభ్రమిస్తూ కేవలం 1.3 రోజులకే మాతృ నక్షత్రాన్ని చుట్టేస్తుంది. అందువల్ల ఈ గ్రహంలో ఒక సంవత్సరమంటే 1.3 రోజులు మాత్రమే.

నెఫ్ట్యూన్ పరిమాణంలో ఉన్న ఈ గ్రహం... నక్షత్రానికి అంత సమీపంలో ఉండటం వల్ల, రేడియేషన్ ప్రభావం కూడా అంతే ఎక్కువగా పొందుతోంది. అందువల్ల దానిపై వాతావరణ పొరలు నాశనమయ్యే అవకాశం ఉంది. మా అంచనా ప్రకారం ఆ గ్రహంపై 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండొచ్చు." -డానియెల్​ బైలీస్, వార్విక్ విశ్వవిద్యాలయం.

ఇలాంటి గ్రహం ఖగోళ శాస్త్రవేత్తలకు ఇంతకుముందు చేసిన పరిశోధనల్లో ఎన్నడూ కనిపించలేదు. అందుకే దీన్ని 'ఫర్బిడెన్​'​ గ్రహం అని పిలుస్తున్నారు. గత పది లక్షల సంవత్సరాల్లో ఈ గ్రహం ఇటీవలే ఇక్కడికి చేరినట్లు భావిస్తున్నారు.

ఇలా కనిపెట్టారు..

ఈ గ్రహాన్ని కనుగొనడానికి ఖగోళ శాస్త్రజ్ఞులు.. చిలీలోని అటకామా ఎడారిలో పన్నెండు 20 సెంటీమీటర్ల టెలిస్కోప్​లను వినియోగించారు. 'నెక్ట్స్​ జెనరేషన్​ ట్రాన్సిట్​ సర్వే (ఎన్​జీటీఎస్​)' ఉపయోగించి ఈ నూతన గ్రహాన్ని కనుగొన్నారు.

ఈ 'ఎన్​జీటీఎస్​-4బి' గ్రహం తన మాతృ నక్షత్రం కక్ష్యలో పరిభ్రమిస్తున్న సమయంలో విడుదలైన కాంతిలో కేవలం మనకు 0.1 శాతం మాత్రమే కనపడింది. ఇలా అతి సూక్ష్మ సంకేతంతో ఓ గ్రహాన్ని కనిపెట్టడం కూడా ఇదే మొదటిసారని డానియెల్ తెలిపారు.

ఇదీ చూడండి: లైవ్​ అప్​డేట్స్​: కేంద్ర కేబినెట్​ తొలి భేటీ

Last Updated : May 31, 2019, 8:10 PM IST

ABOUT THE AUTHOR

...view details