జగిత్యాల టవర్ సర్కిల్ సమీపంలోని పాత ఇనుప సామాను కొనుగోలు దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే దుకాణం పూర్తిగా దగ్ధమైంది. ప్లాస్టిక్ పైపులకు షాట్ సర్క్యూట్ ద్వారా మంటలు అంటుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. గతంలో కూడా ఈ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు.
జగిత్యాలలో అగ్ని ప్రమాదం.. 3 లక్షల ఆస్తి నష్టం - DUE
జగిత్యాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాత ఇనుప సామాను కొనుగోలు దుకాణంలో షాట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు బాధితులు భావిస్తున్నారు.
FIRE ACCIDENT IN JAGITYAL DUE TO SHORT CIRCUIT